Virat Kohli : వన్డేల్లో శతకాలతో రెచ్చిపోతున్న సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా పుమా (Puma) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విరాట్ ఆ సంస్థకు గుడ్ బై చెప్పేశాడు. భారత్‌కు చెందిన ‘అజిలిటస్’ (Agilitas) స్టార్టప్ కంపెనీలో భాగస్వామిగా చేరాడు విరాట్. ఈ విషయాన్ని సోమవారం కోహ్లీ వెల్లడించాడు. అయితే.. తమ ఒప్పందాన్ని పునరుద్దరించడం కోసం కోహ్లీకి పుమా రూ.300 కోట్లు ఆఫర్ చేసిందట. అయినా సరే అంత పెద్ద మొత్తాన్ని సైతం కాదని అజిలిటస్తో డీల్ కుదుర్చుకున్నాడు రన్ మెషీన్.
క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ ఓవైపు మైదానంలో అదరగొడుతూనే.. మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్.. డిజిట్ ఇన్యూరెన్స్ కంపెనీలతో భారీగా అర్జిస్తున్న విరాట్ తాజగా కొత్త స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత ఏనిమిదేళ్లుగా పుమాతో కొనసాగిన కోహ్లీ.. ఈసారి స్వదేశీ అంకుర సంస్థ అజిలిటస్కు జై కొట్టాడు. దిగ్గజ కంపెనీ అయిన పుమాను వదిలేసి.. ఈ స్టార్టప్ కంపెనీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించగా.. ఈ రోజు నుంచి కొత్త అధ్యాయం మొదలవ్వనుంది. స్పష్టమైన లక్ష్యం, మంచి ఉద్దేశంతో వన్ 8, అజిలిటస్ మధ్య కొత్త ప్రయాణం షురూ కానుంది. వన్ 8ను అజిలిటస్ బ్రాండ్‌తో మరింత ముందుకు తీసుకెళ్తా.
Today marks the beginning of an exciting new chapter straight from my heart. A new journey begins for one8 and Agilitas, driven by purpose and ambition. Taking one8 home to Agilitas. pic.twitter.com/mZDoKitq2c
— Virat Kohli (@imVkohli) December 8, 2025
అజిలిటస్ గంగూలీ నుంచి ఆఫర్ రాగానే నన్నే ఎందుకు ఎంచుకున్నారో అర్ధమైంది. క్రీడా దుస్తులు, పరికరాల తయారీలో వీరి నైపుణ్యం బాగుంది. కచ్చితంగా ఇది నాకు గొప్ప అవకాశం అనిపించింది. అందుకే భాగస్వామిగా చేరాను. ముఖ్యంగా అజిలిటస్ మనదేశపు సంస్థ. మనవాళ్లే డిజైన్లు రూపొందిస్తారు. అందుకే.. ఓకే చెప్పాను అని కోహ్లీ ఒక వీడియోలో వెల్లడించాడు. అజిలిటస్లో రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టిన విరాట్ 1.94 శాతం వాటా దక్కించుకున్నాడు.
ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ బ్యాట్‌తో పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు డకౌట్ల తర్వాత అర్ధ శతకంతో ఫామ్ అందుకున్న విరాట్.. స్వదేశంలో శతకాలతో చెలరేగాడు. రాంచీ వన్డేలో దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ 52వ సెంచరీతో సచిన్ టెండూల్కర్ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ్రేక్ చేశాడీ రన్ మెషీన్. అనంతరం రాయ్‌పూర్‌లోనూ అదే జోరు చూపించి.. శతక్కొట్టాడు.
Virat Kohli ends the year with the most ODI runs for India — just 1 ahead of Hitman — with no more ODIs scheduled! 🇮🇳💙🏏#India #ODIs #ViratKohli #Sportskeeda pic.twitter.com/XJsj1J4rh1
— Sportskeeda (@Sportskeeda) December 7, 2025
చివరిదైన వైజాగ్ వన్డేలోనూ హాఫ్ సెంచరీతో వీరవిహారం చేసిన కోహ్లీ.. 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతలో ఉన్న ఈ స్టార్ ప్లేయర్ దేశవాళీలో ఆడేందుకు ఓకే చెప్పాడు. దాదాపు 16 ఏళ్ల తర్వాత విరాట్ వన్డే ఫార్మాట్లో జరుగనున్న ‘విజయ్ హజారే ట్రోఫీ’ (Vijay Hazare Trophy)లో ఢిల్లీ తరఫున ఆడబోతున్నాడు.