IPL 2025 : టీ20ల్లో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డుల పర్వం కొనసాగుతోంది. ఈమధ్యే పొట్టి క్రికెట్లో ‘వంద’ హాఫ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన విరాట్ ఐపీఎల్లో అత్యధిక అర్థ శతకాల వీరుడిగా నిలిచాడు. ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో రెచ్చిపోయి ఆడుతున్న కోహ్లీ 67వ సారి 50 ప్లస్ స్కోర్ చేశాడు. తద్వారా డేవిడ్ వార్నర్ (David Warner) రికార్డును బద్ధలు కొట్టాడు.
ఆదివారం ముల్లనూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఫిఫ్టీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడీ రన్ మెషీన్. దాంతో, అత్యధిక హాఫ్ సెంచరీల జాబితాలో వార్నర్(66) రెండో స్థానానికి పడిపోయాడు. ఐపీఎల్లో ఎక్కువ అర్ధ శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గబ్బర్‌గా పేరొందిన ధావన్ ఖాతాలో 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
What a start to the #IPLRevengeWeek ! 💪#ViratKohli shatters another record as he overtakes #DavidWarner for the most 50+ scores in #TATAIPL history! ❤#IPLonJioStar 👉 #MIvCSK | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/p3AaxKq0ga
— Star Sports (@StarSportsIndia) April 20, 2025
పొట్టి క్రికెట్లో పరుగలు వరద పారిస్తున్న కోహ్లీ ఈ ఐపీఎల్‌లోనే వంద హాఫ్ సెంచరీలు మైలురాయికి చేరువైన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు లిఖించాడు. అంతర్జాతీయంగా ఈ ఘనతకు చేరువైన రెండో క్రికెటర్‌గా విరాట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ కాగా.. కోహ్లీ అతడి సరసన చేరాడు. వార్నర్ 108 ఫిఫ్టీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
THE GREATEST EVER, VIRAT KOHLI 🥶 pic.twitter.com/xiR9qaAczR
— Johns. (@CricCrazyJohns) April 13, 2025
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన వాళ్లలో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజాం(Babar Azam) 90 ఫిఫ్టీలతో మూడో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 88 అర్ధ శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 86 సార్లు యాభైకి పైగా కొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఐదో స్థానం దక్కించుకున్నాడు.