శుక్రవారం 03 జూలై 2020
Sports - Jun 04, 2020 , 23:31:25

అందుకే రోహిత్‌ కన్నా కోహ్లీనే అత్యుత్తమం: హాగ్‌

అందుకే రోహిత్‌ కన్నా కోహ్లీనే అత్యుత్తమం: హాగ్‌

సిడ్నీ: లక్ష్యఛేదనల్లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కన్నా టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతో నిలకడగా, అద్భుతంగా ఆడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ కంటే కోహ్లీ అత్యుత్తమమైన ఆటగాడని అతడు గురువారం ఓ యూట్యూబ్‌ చానెల్‌లో చెప్పాడు. విరాట్‌, రోహిత్‌లో బెస్ట్‌ ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

'విరాట్‌ కోహ్లీనే బెస్ట్‌. ఎందుకంటే భారీ లక్ష్యఛేదనల్లో అతడు నిలకడగా ఆడతాడు. టీమ్‌ఇండియా రెండో బ్యాటింగ్‌ చేసిన చాలాసార్లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే భారత జట్టులో కోహ్లీ, రోహిత్‌కు విభిన్న రోల్స్‌ ఉన్నాయి. అందుకే వారిద్దరినీ పోల్చకూడదు. ఇన్నింగ్స్‌ ఆరంభ పవర్‌ప్లేలో బౌలర్లను బాది వేగంగా పరుగులు రాబట్టడం రోహిత్‌ శర్మ పాత్ర. ఇన్నింగ్స్‌ మొత్తం ఆడడం విరాట్‌ రోల్‌. ఇద్దరూ వారి పనిని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు.  ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు' అని హాగ్‌ చెప్పాడు.  


logo