KL Rahul | భారత కెప్టెన్‌గా రాహుల్ రికార్డు తెలుసా..?
KL Rahul : ఆసియా కప్‌తో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్(KL Rahul) ఫామ్ చాటుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)పై సూపర్ సెంచరీతో విమర్శకులకు చెక్ పెట్టాడు. మిడిలార్డర్లో తానెంత కీలకమైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. అంతేకాదు ఆస్ట్రేలియా(Australia)తో మూడు వన్డేల సిరీస్‌కు...
KL Rahul : ఆసియా కప్(Asia Cup 2023)తో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్(KL Rahul) ఫామ్ చాటుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)పై సూపర్ సెంచరీతో విమర్శకులకు చెక్ పెట్టాడు. మిడిలార్డర్లో తానెంత కీలకమైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. అంతేకాదు ఆస్ట్రేలియా(Australia)తో మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్ భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌లకు సారథ్యం వహించనున్నాడు.
గతంలోనూ టీమిండియాను నడిపించిన రాహుల్ జట్టుకు విజయాలు అందించాడు. నాయకుడిగా అతడి రికార్డుపై ఓ లుక్కేద్దాం. రాహుల్ సారథ్యంలో ఇండియా ఇంతకుముందు 7 వన్డేలు ఆడింది. అందులో నాలుగింటిలో మాత్రమే గెలుపొందింది. అది కూడా బలహీనమైన జింబాబ్వేపై. దక్షిణాఫ్రికాతో తలపడిన మూడు వన్డేల్లో రాహుల్ సేన ఓడిపోయింది. అయితే.. కెప్టెన్‌గా రాహుల్ 7 వన్డేల్లో 36 సగటుతో 115 రన్స్ కొట్టాడు. భారత జట్టుకు మూడు టెస్టుల్లో రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. వాటలో మన జట్టు రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇక టీ20ల్లో ఒకే ఒక మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది.
దాయాది పాక్‌పై సూపర్ సెంచరీ కొట్టిన రాహుల్

భారత్, ఆస్ట్రేలియా జట్లు 24న మొహాలీలో తొలి వన్డేలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 28 (ఇండోర్), అక్టోబర్ (1) రాజ్‌కోట్‌లో చివరి రెండు వన్డేలు జరుగనున్నాయి. వరల్డ్ కప్ ముందు ఇరుజట్లకు ఇదే ఆఖరి సిరీస్. దాంతో, రెండు జట్ల ఆటగాళ్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. అయితే.. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు.
తొలి రెండు వన్డేలకు భారత బృందం : కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, షమీ, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ, అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
ఇవి కూడా చదవండి
Yuvraj Singh | ఆరు సిక్సర్ల ఫీట్‌కు 16 ఏళ్లు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన యువరాజ్ సింగ్
Suryakumar Yadav | కంగారులతో వన్డే సిరీస్.. గోల్డెన్ డక్ సూర్యకు అగ్నిపరీక్షే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

