Suryakumar Yadav | కంగారులతో వన్డే సిరీస్.. గోల్డెన్ డక్ సూర్యకు అగ్నిపరీక్షే..!
Suryakumar Yadav : పొట్టి క్రికెట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వన్డేల్లో తేలిపోతున్నాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా ఒక్కటంటే ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్(Asia Cup 2023)లోనూ విఫలమైన అతడికి ప్రపంచ కప్(ODI World Cup 2023) ముందు...
Suryakumar Yadav : పొట్టి క్రికెట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వన్డేల్లో తేలిపోతున్నాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా ఒక్కటంటే ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్(Asia Cup 2023)లోనూ విఫలమైన అతడికి ప్రపంచ కప్(ODI World Cup 2023) ముందు మరో అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 24న ఆస్ట్రేలియా(Australia)తో మూడు వన్డేల సిరీస్‌లో ఈ స్టార్ ప్లేయర్‌కు అగ్ని పరీక్ష ఎదుర్వనుంది.
అవును.. ఈ ఏడాది ఆరంభంలో కంగారులపై సూర్య ఏకంగా హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్(Hat-trick Golden Ducks)తో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో వరల్డ్ నంబర్ 1 అయిన సూర్య ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) దెబ్బకు ఇలా వచ్చి అలా డగౌట్‌కు వెళ్లాడు. ఆ పీడకల నుంచి నెమ్మదిగా తేరుకున్న సూర్య ఈసారి ఆసీస్‌పై ఎలా రాణిస్తాడు? అనే ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకు పడతాడా? లేదా చెత్త ఆటతో నిరాశపరుస్తాడా? అనేది మరో ఐదు రోజుల్లో తేలిపోనుంది.
సూర్యకుమార్ యాదవ్

నిరుడు ఆసీస్ సిరీస్‌కు ముందు సూర్య విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, కంగారులపై మాత్రం చేతెలెత్తేశాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. వరుసగా రెండు మ్యాచుల్లోమిచెల్ స్టార్క్ ఓవర్లో సూర్య ఔటయ్యాడు. మూడో వన్డేలో ఆష్టన్ అగర్ ఓవర్లో అతను బౌల్డ్ అయ్యాడు. దాంతో, సూర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే.. మేనేజ్మెంట్ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. సంజూ శాంసన్‌ను కాదని వరుసగా చాన్స్‌లు ఇస్తోంది. కోచ్, కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సూర్య నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.
తొలి రెండు వన్డేలకు భారత బృందం : కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, షమీ, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ, అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
వరల్డ్ కప్ ముందు సొంత గడ్డపై సెప్టెంబర్ 24న ఆసీస్‌తో వన్డే సిరీస్ షురూ కానుంది. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ రెండు మ్యాచుల్లో ఇండియా కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) ఏడాది మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు.
ఇవి కూడా చదవండి
R Ashiwn | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అశ్విన్.. వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి వచ్చేనా..?
Shooter Nischal: షూటింగ్ వరల్డ్‌కప్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన నిశ్చల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

