పవర్‌ప్లేలో పంజాబ్ ఎలాగైతే ఇబ్బంది పడిందో.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అలాగే కష్టాలు పడుతోంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే (14), ఫామ్‌లేమితో బాధ పడుతున్న వెంకటేశ్ అయ్యర్(3) ఇద్దరూ పెవిలియన్ చేరారు. రహానేను రబాడ అవుట్ చేయగా.. అయ్యర్‌ను ఒడియన్ స్మిత్ పెవిలియన్ చేర్చాడు.
స్మిత్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ బాదేందుకు అయ్యర్ ప్రయత్నించగా.. హర్‌ప్రీత్ బ్రార్ దాన్ని క్యాచ్ పట్టేశాడు. దీంతో వెంకటేశ్ అయ్యర్ మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. పవర్‌ప్లే ముగిసే సరికి కేకేఆర్ జట్టు 51/2 స్కోరుతో నిలిచింది.