లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ విఫలమవడంతో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్న నితీష్ రాణా (42) అవుటయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన 8వ ఓవర్ మొదటి బంతికే రాణా పెవిలియన్ చేరాడు. గౌతమ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. లాంగాఫ్లో స్టొయినిస్కు చిక్కాడు. దీంతో 65 పరుగుల వద్ద కోల్కతా మూడో వికెట్ కోల్పోయింది. రాణా అవుటవడంతో కీపర్ శామ్ బిల్లింగ్స్ క్రీజులోకి వచ్చాడు.