లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తొలి షాక్ తగిలింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (0) డకౌట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని నేరుగా కొట్టేందుకు ప్రయత్నించిన అతను.. బంతి లైన్ మిస్ అయ్యాడు. దాంతో లైట్‌గా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది. కుడిచేతి వైపు డైవ్ చేసి డీకాక్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో వెంకటేశ్ అయ్యర్ పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే కోల్‌కతా జట్టు తొలి వికెట్ కోల్పోయింది.