KKR vs LSG | ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా అవుట్
కోల్‌కతా, లక్నో జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విజయం లక్నోనే వరించింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన స్థితిలో బాల్ అందుకున్న స్టొయినిస్.. తొలి మూడు బంతుల్లోనే 16 పరుగులిచ్చాడు. అయితే తర్వాతి బంతికి ఎల్విన్ లూయిస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు రింకూ సింగ్ (15 బంతుల్లో 40) అవుటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
ఆ తర్వాత సమీకరణం ఒక్క బంతిలో మూడు పరుగులకు చేరింది. క్రీజులోకి వచ్చిన ఉమేష్ యాదవ్.. బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో శిబిరం విజయోత్సవాల్లో మునిగిపోయింది. ఈ ఓటమితో కోల్‌కతా జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు ధాటిగా ఆడారు.
ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజిత్ (4), ఆండ్రీ రస్సెల్ (5) విఫలమయ్యారు. అయితే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50), నితీష్ రాణా (42), శామ్ బిల్లింగ్స్ (36), రింకూ సింగ్ (40), సునీల్ నరైన్ (7 బంతుల్లో 21 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు.
కానీ విజయం మాత్రం ప్రత్యర్థినే వరించింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్, మార్కస్ స్టొయినిస్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయి తలో వికెట్ తీసుకున్నారు.
WHAT. A. GAME !!@LucknowIPL clinch a thriller by 2 runs.
Scorecard – https://t.co/NbhFO1ozC7 #KKRvLSG #TATAIPL pic.twitter.com/7AkXzwfeYk
— IndianPremierLeague (@IPL) May 18, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

