Gautam Gambhir | సైన్యంలో చేరాలనుకున్నా.. కోల్‌కతా ‘నైట్స్ డగౌట్’లో గంభీర్
Gautam Gambhir : ఐపీఎల్లో రెండు సార్లు చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పదిహేడో సీజన్లో అదరగొడుతోంది. పదిహేడో సీజన్ ముందు కోల్‌కతా మెంటార్(Kolkata Mentor)గా బాధ్యతలు చేపట్టిన గౌతీ సైన్యంలో చేరాలనుకున్నాడట. అయితే.. అనుకోకుండా క్రికెటర్ అయ్యానని ఓ పొడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు.
Gautam Gambhir : ఐపీఎల్లో రెండు సార్లు చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పదిహేడో సీజన్లో అదరగొడుతోంది. మాజీ కెప్టెన్ గౌతం గంభీర్(Gautam Gambhir) మెంటర్‌గా రావడంతో కేకేఆర్ ఆటే మారిపోయింది. కోల్‌కతాకు మునపటి దూకుడు నేర్పిన గంభీర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సైరస్ బ్రొచాతో ‘నైట్స్ డగౌట్’ (Knights Dugout)లో మాట్లాడిన గౌతీ.. తాను ఆర్మీలో చేరాలనుకున్నానని వెల్లడించాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి ఆర్సీలో చేరాలని ఉండేది. అందుకనే 11వ తరగతి చదివే సమయంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలనుకున్నా’ అని గంభీర్ తెలిపాడు.
‘ఆర్మీ అంటే నాకు ఇష్టం. నేను తొలిసారి ప్రేమలో పడింది సైన్యంతోనే. కానీ, నేను నా కలను నిజం చేసుకోలేకపోయాను. అవును.. మా అమ్మ ఓసారి నువ్వు ఏం అవుతావు? అని అడిగింది. అందుకు ఎన్డీఏలో చేరుతా. సైన్యంలో పనిచేస్తా అని బదులిచ్చాను. అయితే.. విధి మరొకటి ప్లాన్ చేసింది. దాంతో, ఆర్మీలో చేరాల్సిన నేను క్రికెటర్ అయ్యాను’ అని గంభీర్ వెల్లడించాడు.
‘నైట్స్ డగౌట్’లో మాట్లాడుతున్న గంభీర్
సైనికుడిగా పని చేయలేకపోయాననే బాధ ఈ మాజీ క్రికెటర్లో అలానే ఉండిపోయింది. అందుకని ఎంతో కొంత ఆ దిగులును తీర్చుకోవాలనే ఉద్దేశంతో గౌతీ సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. 2019లో పుల్వామా దాడి(Pulwama Attack)లో చనిపోయిన సైనికుల పిల్లల చదువు ఖర్చులను గంభీర్ భరిస్తున్నాడు. బీజేపీ ఎంపీగా పనిచేసిన గంభీర్ 17వ సీజన్‌కు ముందు పార్టీ వ్యవహరాల నుంచి తనను దూరంగా పెట్టాలని అధిష్ఠానాన్ని కోరిన విషయం తెలిసిందే.

కేకేఆర్ విక్టరీ కెప్టెన్
కెప్టెన్‌గా కోల్‌కతాకు గంభీర్ రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. ఆ తర్వాత దినేశ్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్, కమిన్స్, నితీశ్ రానా, శ్రేయస్ అయ్యర్.. ఇలా సారథులు మారినా కేకేఆర్ ఆట సీజన్ సీజన్‌కు అధ్వాన్నంగా మారింది. దాంతో, కేకేఆర్ తమ విక్టరీ కెప్టెన్ గౌతీని తిరిగి సొంతగూటికి రప్పించుకుంది. అంతే.. గంభీర్ వ్యూహంలో భాగంగా సునీల్ నరైన్ ఓపెనర్ అవతారమెత్తాడు. గత సీజనల్లో విఫలమైన రస్సెల్ సైతం 17వ సీజన్లో రఫ్ఫాడిస్తున్నాడు. ఇంకేముంది ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా మూడో అత్యధిక స్కోర్ కొట్టింది. అంతేకాదు ఈసారి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
- Cyber Crime | సైబర్ క్రైమ్ డీసీపీ పేరిట రూ. 12 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు
- Election code | ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్.. కర్ణాటక డిప్యూటీ సీఎంపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు..!
- YS Jagan | నేను బచ్చా అయితే.. నా చేతిలో చిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి? చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

