లక్నో: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ( Angkrish Raghuvanshi)కి భారీ జరిమానా పడింది. లక్నోతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్‌కు అడ్డుపడినట్లు తేలింది. ఆ మ్యాచ్ 5వ ఓవర్లో మిడాన్ దిశగా బంతిని కొట్టి పరుగు కోసం వెళ్లాడు. అయితే నాన్‌స్ట్రయికర్ అతన్ని తిప్పిపంపాడు. ఆ క్రమంలో వికెట్ల వైపు పరుగెత్తిన రఘువంశీ.. ఫీల్డర్ బంతిని త్రో చేస్తున్న దిశలో పరుగెత్తాడు. దీంతో థార్డ్ అంపైర్ కేకేఆర్ బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఫీల్డింగ్‌కు అడ్డుపడినట్లుగా పేర్కొన్నారు. అయితే మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. రఘువంశీకి ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతకలిసింది.
ఈ ఏడాది ఐపీఎల్లో ఈ రకంగా ఔటైన తొలి ప్లేయర్ రఘువంశీ. ఐపీఎల్ లెవల్ 1 నేరంగా పరిగణించారు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో చెప్పింది. ఔటై వెనుదిరిగి వెళ్తున్న సమయంలో.. రఘువంశీ బౌండరీ రోప్‌ను తన బ్యాట్‌తో బలంగా కొట్టాడు. ఆ తర్వాత అతను తన హెల్మెట్ తీసి కోపంతో డగౌట్ వైపు విసిరేశాడు. ఫీల్డర్‌కు అడ్డుపడడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించినందుకు రఘువంశీకి ఫైన్ వేశారు. నేరాన్ని అంగీకరించిన రఘువంశీ .. మ్యాచ్ రిఫరీ విధించిన ఆంక్షలును కూడా ఆమోదించాడు.