Hyderabad | న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్ 18-10తో కొచ్చి కేడీస్పై అద్భుత విజయం సాధించింది. ఆరంభం పోరు అండర్కార్డ్ నుంచే హైదరాబాద్ ప్లేయర్లు అదరగొట్టారు.
తొలుత 70కిలోల ఫైట్‌లో షాహిల్ హుస్సేన్ 1-0తో వైభవ్‌పై గెలువగా, మహిళల 65కిలోల కేటగిరీలో మధుర 1-0తో జగ్ప్రీత్పై, రాహుల్ మెహర్ 1-0తో శివపై గెలువడంతో హైదరాబాద్ 3-0 ఆధిక్యం కనబరిచింది. మెయిన్ కార్డ్‌లో అదే జోరు కొనసాగిస్తూ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి పోరు తమ వశం చేసుకుంది. గురువారం జరిగే పోరులో ముంబై మజిల్‌తో హైదరాబాద్ తలపడుతుంది.