ట్రినిడాడ్: వెస్టిండీస్ మాజీ ప్లేయర్ కీరన్ పోలార్డ్(Kieron Pollard) భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను ట్రింబాగో నైట్ రైడర్స్ తరపున ఆడాడు. పాట్రియాట్స్ జట్టుతో సెయింట్ కిట్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను 29 బంతుల్లో 65 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, రెండు ఫోర్లు ఉఉన్నాయి. అయితే 38 ఏళ్ల ఆ క్రికెటర్.. వరుసగా 8 బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టాడు. నవియన్ బిడైసీ, వకార్ సలామ్‌ఖేల్ బౌలింగ్‌లో అతను నాలుగేసి సిక్సర్లు కొట్టారు. నాలుగో వికెట్‌కు పూరన్‌తో కలిసి 90 రన్స్ జోడించాడు.
బిడైసీ వేసిన 15వ ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఓవర్లో సలామ్‌ఖేల్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు పోలార్డ్. టీ20ల్లో 14 వేల రన్స్ చేసిన రెండో విండీస్ బ్యాటర్‌గా పోలార్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో క్రిస్ గేల్ ఆ రికార్డు అందుకున్నాడు. టీ20 క్రికెట్లో క్రిస్ గేల్ 1056 సిక్సర్లు కొట్టగా, పోలార్డ్ 950 సిక్సర్లు బాదాడు.
ఈ మ్యాచ్‌లో పోలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నైట్ రైడర్స్ జట్టుకు బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ఓనర్‌గా ఉన్నాడు. 180 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాట్రియాట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 12 రన్స్ తేడాతో పోలార్డ్ జట్టు నెగ్గింది.
POLLY POWERRR!!! 💪🇹🇹
Kieron Pollard raises yet another CPL fifty! 🙌#CPL25 #CricketPlayedLouder#BiggestPartyInSport #TKRvSKNP #RepublicBank pic.twitter.com/huJek5r4cL
— CPL T20 (@CPL) September 1, 2025