Japan Open : టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్(Japan Open 2023)ల్ భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) బోణీ కొట్టారు. వీళ్లిద్దరూ టాప్ సీడ్లకు షాకిచ్చి పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 20వ సీడ్ శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్పై విజయం సాధించాడు. 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అతను వరల్డ్ నంబర్ 8 చౌను 21-13, 21-13తో చిత్తు చేశాడు. దాంతో, అతడిపై రెండో విజయం నమోదు చేశాడు.
మరో మ్యాచ్‌లో ప్రణయ్ చైనా ఆటగాడు లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. 49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌పై ప్రణయ్ పై చేయి సాధించాడు. ఈ మధ్యే ముగిసిన కొరియా ఓపెన్, ఇండోనేషియన్ ఓపెన్‌లో శ్రీకాంత్, ప్రణయ్ సత్తా చాటలేకపోయారు. దాంతో, ఈసారి టైటిల్‌పై కన్నేశారు. అయితే.. ప్రీ- క్వార్టర్ మ్యాచ్‌లో శ్రీకాంత్, ప్రణయ్ తలపడనున్నారు. దాంతో, ఒక భారత షట్లర్ టోర్నీ నుంచి వెనుదిరిగనున్నాడు.