IPL 2025 | ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. ఈ మేరకు కేపీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం చేసుకుంది. రాబోయే సీజన్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. మెంటార్ రోల్లో కేపీ ఢిల్లీ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్‌గా హేమంగ్ బదానీ, అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాలరావు పని చేస్తున్నాడు. వీరందరితో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు కోసం కేపీ వ్యూహాలు రచించనున్నాడు. గతంలో కేపీ తరఫున ఆటగాడిగా బరిలోకి దిగి దుమ్మురేపాడు ఈ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్. ఆ తర్వాత కొద్దిరోజులు కామెంటేటర్‌గా అలరించాడు. గతంలో ఎప్పుడూ కోచింగ్ రోల్లో మాత్రం కనిపించలేదు. తొలిసారిగా కోచింగ్ టీమ్‌లో చేరనున్నాడు.
Tell the world, KP is back home! ❤️💙 pic.twitter.com/60QdLEiSCX
— Delhi Capitals (@DelhiCapitals) February 27, 2025
కేపీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు జట్ల తరఫున ఆడాడు. మొదట ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరఫున ఐపీఎల్ ఆడాడు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ఈ ఏడాది మార్చి 22న మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద లచేసింది. ఢిల్లీ క్యాపిట్స్ జట్టు తొలి మ్యాచ్‌ను మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనున్నది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు యాజమాన్యం కెప్టెన్‌ను నియమించే పనిలో పడింది. గత సీజన్లో కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పంత్ స్థానంలో బాధ్యతలు ఎవరికి అప్పగించాలని చూస్తున్నది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ రేసులో ముందువరుసలో ఉన్నారు.
The Dilli x KP love story continues 💙❤️ pic.twitter.com/MmzMagVFBB
— Delhi Capitals (@DelhiCapitals) February 27, 2025