HomeSportsKcr Cup Ended In Melbourne With Victory Kcr Cricket Cup Tournament Ended Grandly On September 17th In Australia Melbourne
KCR cup 2023 | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ క్రికెట్ కప్
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురసరించుకుని మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్‌ను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో టోర్నీ నిర్వహించినట్లు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురసరించుకుని మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్‌ను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో టోర్నీ నిర్వహించినట్లు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు. భారత్ నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారని వివరించారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడంలో ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేసేందుకు క్రికెట్ సరైన వేదిక అని భావించి ఈ టోర్నీ నిర్వహించామని నాగేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాయిరామ్ ఉప్పు, వినయ్సన్నీగౌడ్, సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల, వంగపల్లి సురేందర్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.