IPL 2025 : ఢిల్లీ గడ్డపై రివెంజ్ మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్(2-10) విజృంభణకు తోడు కరుణ్ నాయర్ ఖతర్నాక్ ఫీల్డింగ్ కారణంగా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ ఒకే ఓవర్లో ఓపెనర్ జాకబ్ బెథెమ్(12), ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు.
ఆ కాసేపటికే కెప్టెన్ రజత్ పాటిదార్(6) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దాంతో, 26 పరుగులకే బెంగళూరు జట్టు 3 ప్రధాన వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(15), కృనాల్ పాండ్యా(2) ఆచితూచి ఆడుతున్నారు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. ఇంకా విజయానికి 78 బంతుల్లో 128పరుగులు కావాలి.
𝐁𝐮𝐥𝐥𝐬𝐞𝐲𝐞 🎯
Karun Nair with a superb direct-hit ☝️#RCB lose their skipper in the chase!
Updates ▶ https://t.co/9M3N5Ws7Hm#TATAIPL | #DCvRCB | @DelhiCapitals | @karun126 pic.twitter.com/al5wBbHAhe
— IndianPremierLeague (@IPL) April 27, 2025
ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 163 పరుగుల ఛేదనను ఆర్సీబీ దూకుడుగా ఆరంభించింది. ఫిలిప్ సాల్ట్ బదులు ఆడుతున్న కుర్రాడు జాకబ్ బేథెమ్(12) యార్కర్ కింగ్ స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్‌తో అదరగొట్టాడు. అయితే.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ సిక్సర్ కొట్టబోగా.. కరుణ్ నాయర్ పరుగెత్తుతూ వచ్చి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అదే ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ(15)తో సమన్వయం లోపంతో పటిదార్(6).. కరుణ్ డైరెక్ట్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు.