ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 10:35:36

విలియ‌మ్‌స‌న్ ఖాతాలో నాలుగ‌వ డ‌బుల్ సెంచ‌రీ

విలియ‌మ్‌స‌న్ ఖాతాలో నాలుగ‌వ డ‌బుల్ సెంచ‌రీ

క్రైస్ట్‌చ‌ర్చ్‌: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌.. టాప్ బ్యాటింగ్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.  పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టు మ్యాచ్‌లో విలియ‌మ్‌స‌న్ డ‌బుల్ సెంచ‌రీ చేశాడు.  కివీస్ కెప్టెన్ 364 బంతుల్లో 238 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. విలియ‌మ్‌స‌న్ ఇన్నింగ్స్‌లో 28 బౌండ‌రీలు ఉన్నాయి. మూడ‌వ రోజు టీ స‌మ‌యానికి న్యూజిలాండ్ 6 వికెట్ల న‌ష్టానికి 599 చేసింది.  30 ఏళ్ల విలియ‌మ్‌స‌న్ ఖాతాలో ఇవాళ రెండు రికార్డులు జ‌త‌కూడాయి. టెస్టుల్లో ఏడు వేల ప‌రుగుల మైలురాయిని దాటిన కివీస్ ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. గ‌తంలో కివీస్ ఆట‌గాళ్లు రాస్ టేల‌ర్‌(7379), స్టీఫెన్ ఫ్లెమింగ్‌(7172) ఈ మైలురాయిని దాటారు.

కేన్ జోరు..

తొలి ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల‌స్‌తో క‌లిసి విలియ‌మ్‌స‌న్ భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఇటీవ‌ల వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో విలియ‌మ్‌స‌న్ డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను 251 ప‌రుగులు చేశాడు.  అయితే ఆ జ‌ట్టుతో జ‌రిగిన రెండ‌వ టెస్ట్ మ్యాచ్‌ను అత‌ను మిస్స‌య్యాడు.  ఇక పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టెస్టులో 129 ర‌న్స్ చేశాడు. కేన్ విలియ‌మ్‌స‌న్ మొత్తం నాలుగు డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు.  కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో కేన్ రెండ‌వ సారి డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. క్రైస్ట్‌చ‌ర్చ్ టెస్టులో పాక్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 297 ర‌న్స్ చేసింది. 


logo