హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బీ డివిజన్ లీగ్‌లో కమల్ స్వరూప్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. మాంచెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో సలీమ్‌నగర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కమల్ ఐదు వికెట్లతో విజృంభించాడు. దీంతో మ్యాచ్‌లో సలీమ్‌నగర్ 7 వికెట్ల తేడాతో మాంచెస్టర్‌పై ఘన విజయం సాధించింది.
తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిన కమల్ ఈ సీజన్లో ఓవరాల్‌గా 14 వికెట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తున్న కమల్ ఈ సీజన్లో సలీమ్‌నగర్ జట్టుకు కీలకంగా మారాడు. పదునైన స్వింగ్‌తో ఆదిలోనే ప్రత్యర్థి జట్లను దెబ్బతీయడంలో కమల్..ముందువరుసలో ఉన్నాడు.