ఢిల్లీ: కొత్త సీజన్‌ను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రికార్డు రేసుతో ప్రారంభించింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న నాంటెస్ మెట్రోపోల్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో భాగంగా 60 మీటర్ల రేసును ఆమె 8.04 సెకన్లలోనే పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డును సృష్టించడమే గాక స్వర్ణాన్నీ గెలుచుకుంది.
ఈ క్రమంలో జ్యోతి గత రికార్డు (2024లో ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్ మీట్లో 8.12 సెకన్లు)ను అధిగమించింది.