Jos Buttler | పొట్టి క్రికెట్లో నన్ను భయపెట్టిన బౌలర్ అతనే : జోస్ బట్లర్
పొట్టి క్రికెట్లో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా తనను భయపెట్టాడని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. పొట్టి క్రికెట్లో బట్లర్‌పై బుమ్రాకు మెరుగైన రికార్డు ఉంది. టీ20ల్లో అతడిని ఈ యార్కర్ కింగ్ 4 సార్లు ఔట్ చేశాడు.
Jos Buttler : పొట్టి క్రికెట్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఎంతటి విధ్యంసక ఆటగాడో అందరికి తెలిసిందే. అలాంటి అతను ఒక బౌలర్‌ను ఎదుర్కొనేందుకు భయపడ్డాడట. ఆ బౌలర్ ఎవరో కాదు.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ విషయాన్ని తాజాగా క్రిక్ ఇన్ఫోతో బట్లర్ వెల్లడించాడు. ‘టీ20ల్లో నిన్ను భయపెట్టిన బౌలర్ ఎవరు?’ అనే ప్రశ్నకు అతను.. ‘భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా’ అని బదులిచ్చాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో బట్లర్‌పై బుమ్రాకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు టీ20ల్లో అతడిని ఈ యార్కర్ కింగ్ నాలుగు సార్లు ఔట్ చేశాడు.
రెండు ఐసీసీ ట్రోఫీలు
ఇంగ్లండ్ జట్టు 2019లో తొలి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ హాఫ్ సెంచరీ (59)తో రాణించాడు. బెన్‌స్టోక్స్ 89 రన్స్‌తో నాటౌట్‌గా నిలవడంతో మోర్గాన్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. పోయిన ఏడాది బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. విశేషం ఏంటంటే.. 2016 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన బట్లర్, బుమ్రాతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఈ ఇంగ్లండ్ కెప్టెన్ ఆడాడు. దాంతో, రెండోసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

