ENG vs AUS | మాంచెస్టర్: వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (81 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో ఆస్ట్రేలియాతో యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది.
జాక్ క్రాలీ (189) సూపర్ సెంచరీకి బెయిర్‌స్టో, జో రూట్ (84), మోయిన్ అలీ (54), హ్యారీ బ్రూక్ (61), కెప్టెన్ బెన్ స్టోక్స్ (51) అర్ధశతకాలు తోడవడంతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.