న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు.
మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. 26ఏండ్ల ఆర్చర్ కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరఫున కెంట్‌తో మ్యాచ్‌లో ఆడాడు. కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఫాస్ట్ బౌలర్ గతవారం సర్రేతో జరిగిన సెకండ్ ఎలెవన్ గేమ్‌లో 29.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు తన కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్
చేయలేకపోయాడని వివరించింది.