JioStar: గ్రేట్ ఇండియా క్రికెట్ ఫెస్టివల్ సీజన్ ప్రకటించిన జియోస్టార్
JioStar: 5 నెలల నాన్‌స్టాప్ క్రికెట్ యాక్షన్ ప్రారంభంకానున్నది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి గ్రేట్ ఇండియా క్రికెట్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ కానున్నది. ఆ సీజన్‌కు చెందిన 22 మ్యాచ్‌లను జియోస్టార్ ప్రసారం చేయనున్నది.
హైదరాబాద్: ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ ఫెస్టివల్‌ను జియోస్టార్ ప్రకటించింది. నాలుగు దేశాలతో జరిగే హోం సిరీస్ క్రికెట్ సీజన్‌పై జియోస్టార్ ప్రకటన చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లను జియోస్టార్ ప్రసారం చేయనున్నది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ క్రికెట్ సీజన్ ప్రారంభంకానున్నది. మార్చి 3, 2027 వరకు ఈ సీజన్ కొనసాగనున్నది. వన్డేలు, టీ20లు, టెస్టులకు చెందిన 22 మ్యాచ్‌లను జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనున్నారు. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేతో వన్డే ద్వైపాక్షి సిరీస్‌ను ఇండియా ఆడనున్నది. 2027లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఈ సీజన్ ప్రిపరేషన్ కానున్నది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే అయిదు మ్యాచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా జియోస్టార్ ప్రసారం చేయనున్నది. జనవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఈ సిరీస్ జరగనున్నది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఈ సిరీస్ కీలకంగా మారనున్నది. జియోస్టార్ సేల్స్ హెడ్ అనూప్ గోవిందన్ మాట్లాడుతూ.. క్రికెట్ ఫెస్టివల్ సీజన్ వరుసగా అయిదు నెలలు కొనసాగుతుందని అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

