71% భారత వర్సిటీల ర్యాంకులు పతనం
ప్రపంచ స్థాయితో పోల్చుకుంటే భారత్లోని విద్యాసంస్థల ప్రమాణాలు దిగజారుతున్నాయి. తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-ఆసియా 2027 ఈ విషయాన్ని వెల్లడించింది.
- 180 స్థానాలు దిగజారిన ఉస్మానియా యూనివర్సిటీ
- క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-ఆసియా లో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రపంచ స్థాయితో పోల్చుకుంటే భారత్లోని విద్యాసంస్థల ప్రమాణాలు దిగజారుతున్నాయి. తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-ఆసియా 2027 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న వాటిలో 71 శాతం సంస్థల ర్యాంకులు దిగజారాయి. టాప్ 6 సంస్థలకు కూడా ర్యాంకులు తగ్గాయి.
అత్యుత్తమ యూనివర్సిటీల ర్యాంకులు కూడా పతనం అయ్యాయి. టాప్-100 నుంచి ఢిల్లీ యూనివర్సిటీ తొలగిపోగా, ఐఐటీ ఢిల్లీ 66వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో దీనికి 59వ ర్యాంక్ దక్కింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 64 నుంచి 79కి, ఐఐటీ బాంబే 71 నుంచి 81కి, ఐఐటీ మద్రాస్ 70 నుంచి 80 స్థానానికి పడిపోయాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం 96 నుంచి 106వ స్థానానికి దిగజారింది. దీంతో టాప్ 100 జాబితాలో స్థానాన్ని కోల్పోయింది.
180 స్ధానాలు దిగజారిన ఓయూ
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) ఏకంగా 180 ర్యాంకులు దిగజారి 470 నుంచి 650 స్థానానికి పడిపోయింది. కేరళలోని మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం 495 నుంచి 697కి, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం 458 నుంచి 631కి దిగజారాయి. టాప్-200లో ఉన్న సంస్థల్లో ఐఐటీ కాన్పూర్, యూపీఈఎస్ విశ్వవిద్యాలయాలు ఒక్కొక్కటీ 20 స్థానాలు కోల్పోయాయి. అయితే కొన్ని విద్యాసంస్థలు గతంలో కన్నా మెరుగయ్యాయి.
చండీగఢ్ విశ్వవిద్యాలయం 109 నుంచి 104కి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 187 నుంచి 154కి, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 200 నుంచి 175కి, ఐఐటీ హైదరాబాద్ 270 నుంచి 251కి, వారణాసి 237 నుంచి 219కి, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 130 నుంచి 128కి, జామియా మిలియా ఇస్లామియా 197 నుంచి 183కి ఎగబాకాయి. ఆసియాలో పెరుగుతున్న పోటీ కారణంగా భారత విద్యాలయాల ర్యాంకులు తగ్గాయని క్యూఎస్ పేర్కొంది. ఈ ఏడాది ర్యాంకింగ్స్లో 195 కొత్త విశ్వవిద్యాలయాలు పెరగడంతో పోటీ తీవ్రంగా ఉందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

