రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడి మృతి
ల్యాండింగ్ అవుతుండగా, రెండు హెలికాప్టర్లు ఢీకొని ఒక భారతీయుడు మరణించగా, ముగ్గురు గాయపడిన ఘటన నేపాల్‌లో జరిగింది. సోలుకుంబు జిల్లా కుంబు పసాంగ్ లాము రూరల్ మున్సిపాల్టీ పెహెరిచేలోని నాలుగో వార్డులో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాఠ్మాండూ, నవంబర్ 3: ల్యాండింగ్ అవుతుండగా, రెండు హెలికాప్టర్లు ఢీకొని ఒక భారతీయుడు మరణించగా, ముగ్గురు గాయపడిన ఘటన నేపాల్‌లో జరిగింది. సోలుకుంబు జిల్లా కుంబు పసాంగ్ లాము రూరల్ మున్సిపాల్టీ పెహెరిచేలోని నాలుగో వార్డులో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫిష్‌టైల్ ఎయిర్, ఎయిర్ డైనస్టీలకు చెందిన రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్ అవుతుండగా, ఒకదానిని మరొకటి ఢీకొనడంతో ఫిష్‌టెయిల్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వసంత్ కుమార్ బలరామరామడు అనే భారతీయుడు మరణించారు.
అలాగే భారతీయ సంతతికి చెందిన న్యూజిలాండ్ వాసి శైలేష్ కృష్ణ గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం మరో హెలికాప్టర్ ద్వారా కాఠ్మాండూకు తరలించారు. ఈ ఘటనలో నేపాల్ పైలట్లు రవీంద్ర ప్రజాపతి, ప్రజ్వల్ కేసీలు గాయపడ్డారు. పెహెరిచే ప్రాంతం ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లే మార్గంలో కాఠ్మాండూకు 150 కి.మీ ఈశాన్యంలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

