వండేది చూడొచ్చు!
ఎయిర్ ఫ్రైయర్లో వంట చేస్తున్నప్పుడు ఆహారం ఎంతవరకు ఉడికిందో చూడాలంటే బుట్టను బయటికి తీయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వంట జరుగుతున్న తీరును బయట నుంచే గమనించే సౌకర్యంతో కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది.
ఎయిర్ ఫ్రైయర్లో వంట చేస్తున్నప్పుడు ఆహారం ఎంతవరకు ఉడికిందో చూడాలంటే బుట్టను బయటికి తీయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వంట జరుగుతున్న తీరును బయట నుంచే గమనించే సౌకర్యంతో కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే ‘నింజా క్రిస్పి గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్’. సాధారణ ఎయిర్ ఫ్రైయర్లో ఉండే అపారదర్శక బుట్టకు బదులుగా ఇందులో పారదర్శకమైన బోరోసిలికేట్ గాజు పాత్రలు ఉంటాయి. అందులో ఆహారం రంగు మారుతున్న తీరును, పైభాగం కరకరలాడేలా తయారవుతున్న విధానాన్ని గమనించవచ్చు. 1,700 వాట్ల శక్తితో పనిచేసే ఈ పరికరం వేడి గాలిని అన్ని వైపులా ప్రసరింపజేసి ఆహారాన్ని ఉడికిస్తుంది.
1.4 లీటర్లు, 3.8 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు పాత్రలు ఉండటంతో ఒక్కరి కోసం చిన్న పరిమాణంలోనూ, కుటుంబానికి సరిపడా పెద్ద మొత్తంలోనూ ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఈ పరికరంలో ఆహారాన్ని వేయించడం, కాల్చడం, వెచ్చగా ఉంచడం వంటి పనులతో పాటు ముందుగా వండిన పదార్థాలను మళ్లీ కరకరలాడేలా చేసే ప్రత్యేక విధానం ఉంది. ఉదాహరణకు, మిగిలిపోయిన సమోసాలు, పకోడీలు, పిజ్జాలను మళ్లీ వేడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వంట చేసిన గాజు పాత్రలోనే ఆహారాన్ని వడ్డించవచ్చు, చల్లారిన తర్వాత మూతపెట్టి నిల్వ చేయవచ్చు కూడా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

