Jemimah Rodrigues : వరల్డ్ కప్ ఛాంపియన్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మళ్లీ క్రికెట్‌తో బిజీ కానుంది. స్వదేశంలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీ బాదిన జమీమా.. ఇక ఫ్రాంచైజీ క్రికెట్లోనూ దంచేయనుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ (Brisbane Heat) జట్టుకు ఆడేందుకు ఈ టీమిండియా స్టార్ శనివారం ఆస్ట్రేలియాకు బయల్దేరింది. మహిళల బిగ్‌బాష్ లీగ్కోసం తాను ఎంతో ఆతృతగా ఉన్నానని చెప్పిన జెమీమా.. ‘తదుపరి స్టాప్ ఆస్ట్రేలియా’ అనే క్యాప్షన్తోవిమానంలో దిగిన సెల్ఫీ ఫొటోను పంచుకుంది.
విశ్వ విజేతగా ప్రశంసలు అందుకుంటున్న జెమీమా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో వాలిపోయింది. వరల్డ్ కప్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా బిగ్‌బాష్ లీగ్‌లో మెరవునుంది. గత సీజన్లో బ్రిస్టేన్ హీట్ తరఫున ఆమె 139.06 స్ట్రయిక్ రేటుతో 267 పరుగులు చేసింది. ఈసారి ఈ ఫ్రాంచైజీకి ఆడుతున్న రెండో విదేశీ క్రికెటర్‌గా గుర్తింపు సాధించింది జెమీమా. మరో క్రికెటర్ ఎవరంటే.. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నడినే డీక్లెర్క్.
Jemimah Rodrigues on her way to Australia for the WBBL ✈️ #CricketTwitter pic.twitter.com/XHAOF7gASA
— Female Cricket (@imfemalecricket) November 7, 2025
బ్రిస్బేన్ హీట్ స్క్వాడ్ : జెస్ జొనాసెన్, జెమీమా రోడ్రిగ్స్, లిలీ బస్సింగ్త్వగ్తే, బొన్ని బెర్రీ, లుసీ బౌర్కే, చిన్నెల్లె హెన్రీ, నడినే డీక్లెర్క్, సియన్న జింజర్, లుసీ హమిల్టన్, నికొల హన్‌కాక్, గ్రేస్ హ్యారిస్, చార్లీ నాట్, గ్రేస్ పార్సన్స్, జార్జియా రెడ్మేనే.
వరల్డ్ కప్ విజయంతో భారత్‌లో మహిళల క్రికెట్ మరింత అభివృద్ది చెందుతుందని చెప్పింది జెమీమా. తమను సన్మానించి, నగదు ప్రోత్సాహం అందించిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. 2011లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వరల్డ్ కప్ విజేతగా బాంద్రాకు వచ్చిన రోజులను తను గుర్తు చేసుకుంది. ‘వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందిన తర్వాత బాంద్రాలోని సచిన్ ఇల్లు సందర్శకులతో కిటకిటలాడింది. మా ఇల్లు పక్కనే కావడంతో బాల్కనీ నుంచి సచిన్‌ను చూశాను. ఆయన కారు కూడా కదలేనంతగా జనం పోగయ్యారు. అప్పుడు నాకు 11 ఏళ్లు. ఆ సమయంలోనే నేను వరల్డ్ కప్ ఛాంపియన్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని జెమీమా వెల్లడించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో అజేయం శతకం(127 నాటౌట్)తో జట్టుకు విజయాన్ని అందించింది జెమీమా.
భారత మహిళల జట్టు దశాబ్దాల కల సాకారమవ్వడంలో కీలకంగా వ్యవహరించిన మంధాన, జెమీమా, రాధాలను సీఎం ఫడ్నవీస్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ అద్భుత ఆటతో వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించిన ఈ ముగ్గురికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువాలు కప్పి సత్కరించారు. అంతేకాదు తలా రూ.2.5కోట్ల చెక్కును ప్రదాన చేశారు సీఎం. కోచ్ అన్మోల్ మజుందార్‌కు రూ.2.5లక్షల చెక్కున ముఖ్యమంత్రి అందజేశారు.
VIDEO | Mumbai: Maharashtra CM Devendra Fadnavis and Deputy CM Ajit Pawar felicitate World Cup champions Smriti Mandhana, Jemimah Rodrigues, and Radha Yadav.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/BGrBvYcazZ
— Press Trust of India (@PTI_News) November 7, 2025