DC vs UPW | రెండో మ్యాచ్‌లోనూ రెండొందలు కొట్టిన ఢిల్లీ.. యూపీ టార్గెట్ 212
మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండొందలు కొట్టింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మేగ్ లానింగ్ (70) అర్ధ శతకంతో చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (34), జెస్ జొనాసెన్ (42) చివర్లో ధాటిగా ఆడారు.
DC vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండొందలు కొట్టింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మేగ్ లానింగ్ (70) అర్ధ శతకంతో చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (34), జెస్ జొనాసెన్ (42) చివర్లో ధాటిగా ఆడారు. దాంతో, ఆ జట్టు 200 ప్లస్ స్కోర్ చేయగలిగింది. వీళ్లు ఐదో వికెట్‌కు 67 రన్స్ జోడించారు. అలిసే క్యాప్సే(21), షఫాలీ వర్మ (17), మరిజానే కాప్ (16) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగింది. యూపీ బౌలర్లలో షబ్నం ఇస్మాయిల్, తహ్లియా మెక్‌గ్రాత్, రాజేశ్వరీ గైక్వాడ్, సోఫియా ఎక్లెస్టోన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రెండో హాఫ్ సెంచరీ
రెండో మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (17), మేగ్ లానింగ్ (70) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు పరుగులు జోడించారు. దాంతో, జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశారు. 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది. కిరణ్ నవిగెర్ బౌండరీ వద్ద డైవింగ్ క్యాచ్ పట్టడంతో షఫాలీ ఔట్ అయింది. ఆమె ఔటయ్యాక లానింగ్ స్పీడ్ పెంచింది. మొదటి మ్యాచ్‌లో కొట్టిన ఆమె ఈ లీగ్‌లో రెండో హాఫ్ సెంచరీ బాదింది. ఈ ఓపెనర్ 42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 స్కోర్ చేసింది. యూపీ బౌలర్లపై విరుచుకు పడిన ఆమె 170 స్ట్రయిక్ రేటుతో బ్యాటింగ్ చేసింది. 144 వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ పడింది. ఆ తర్వాత జెమీమా, జొనాసెన్ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. జొనాసెన్ సిక్సర్లతో యూపీ బౌలర్లపై విరుచుకుపడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

