హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఆదివారం నిర్వహించిన మారథన్ రన్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఇబ్రహీంపట్నం సెరెనాసిటీలో నిర్వహించిన ఈ రన్లో 10కే, 5 కే విభాగాల్లో పోటీలు జరుగగా.. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ మారథాన్లో దాదాపు వెయ్యి మంది రన్నర్లు పాల్గొనగా.. విజేతలకు సంస్థ డైరెక్టర్లు ట్రోఫీలు అందజేశారు.