Jasprit Bumrah : భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తన బౌలింగ్ పదును చూపించాడు. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఐదు మ్యాచుల్లో వికెట్ తీయలేక నిరాశపరిచిన ఈ యార్కర్ కింగ్ అహ్మదాబాద్‌లో చెలరేగాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్(0)ను ఔట్ చేశాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పేస్ అస్త్రం బుమ్రా అంటే బ్యాటర్లు వణికిపోయేవారు. కానీ, పంతొమ్మిదో సీజన్లో ఈ స్పీడ్‌స్టర్ పెద్దగా ప్రభావం చూపలేదు. పవర్ ప్లేలోనే వికెట్ల వేటతో ప్రత్యర్థిని భయపెట్టే బుమ్రా ఐదు మ్యాచుల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయినా సరే ముంబై అతడిని పక్కనపెట్టలేదు.
Guess who’s back? 🔥#JaspritBumrah makes a statement with his first wicket of the season, putting #MI on 🔝#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATomY pic.twitter.com/eQJ9QHheuX
— Star Sports (@StarSportsIndia) April 20, 2026
కెప్టెన్, కోచ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని ఈ వెటరన్ తొలి బంతికే వికెట్ తీసి తాను ఛాంపియన్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. 200 పరుగుల ఛేదనలో దంచేయాలనుకున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(0) కవర్స్‌లో ఆడిన బంతిని భగత్ ఒడుపుగా అందుకున్నాడు. అంతే.. బుమ్రా సహా ముంబై ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.