James Anderson | నిరుడే రిటైర్మెంట్ చెప్పాలనుకున్న బ్రాడ్.. ఆ ఇద్దరే అడ్డుపడ్డారు : అండర్సన్
James Anderson : ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) యాషెస్ సిరీస్(Ashes Series)తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే.. బ్రాడ్ వీడ్కోలు నిర్ణయంపై ఆ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) షాకింగ్ విషయాలు చెప్పాడు. ఏడాది క్రితమే ఆట నుంచి తప్పుకోవాలని అనున్నాడని, కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes), హెడ్ కోచ్...
James Anderson : ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) యాషెస్ సిరీస్(Ashes Series)తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే.. బ్రాడ్ వీడ్కోలు నిర్ణయంపై ఆ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) షాకింగ్ విషయాలు చెప్పాడు. ఏడాది క్రితమే ఆట నుంచి తప్పుకోవాలని అనున్నాడని, కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes), హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాడని అండర్సన్ తెలిపాడు.
‘నిరుడు వేసవిలోనే బ్రాడ్ రిటైర్మెంట్ చెప్పాలని అనుకున్నాడు. కానీ, స్టోక్స్, మెక్కల్లమ్ అతడితో మాట్లాడి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. అందుకు అతను అంగీకరించాడు. ఇంగ్లండ్ జట్టు గొప్ప బౌలర్లలో స్టువార్ట్ బ్రాడ్ ఒకడు’ అని జిమ్మీ చెప్పుకొచ్చాడు.
స్టువార్ట్ బ్రాడ్

ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టుతో బ్రాడ్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ మ్యాచ్‌లో అతను అరుదైన ఫీట్ సాధించాడు. కెరీర్లో ఎదుర్కొన్న ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన, వికెట్ తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 37 ఏళ్ల బ్రాడ్ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
యువరాజ్ సింగ్, బ్రాడ్

టెస్టుల్లో భారత జట్టుపై హ్యాట్రిక్ (Hat-trick) తీసిన మొదటి బౌలర్‌గా బ్రాడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు సమర్పించుకున్న మొదటి బౌలర్ తనే. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ధాటికి బ్రాడ్ ఒకే ఓవర్లో ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియాపై 150 వికెట్ల ఫీట్ సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా బ్రాడ్ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ స్టార్ పేసర్ ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)ను అత్యధికంగా 18 సార్లు ఔట్ చేశాడు.
అలీ రీ – ఎంట్రీ
యాషెస్ సిరీస్‌తో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) కూడా టెస్టుల్లో రీ – ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కోరడంతో అతను మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో చెరో రెండు విజయాలు సాధించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా 2-2తో సిరీస్ డ్రా చేసుకున్నాయి. దాంతో, 2011 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలవాలనుకున్న కంగారులకు నిరాశే మిగిలింది.
ఇవి కూడా చదవండి
Rinku Singh | నాన్న ఇప్పటికీ సిలిండర్లు అమ్ముతున్నాడు.. తండ్రి గురించి విస్తుపోయే నిజాలు చెప్పిన క్రికెటర్
Australia Open 2023 | క్వార్టర్స్‌లో ప్రణయ్, సింధు, శ్రీకాంత్.. ఇంటిదారి పట్టిన మిధున్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

