అర్టింగ్టన్(అమెరికా): బాక్సింగ్ ఆల్‌టైమ్ గ్రేట్ మైఖ్ టైసన్‌కు చుక్కెదురైంది. తన పవర్ఫుల్ పంచ్‌లతో ప్రపంచ బాక్సింగ్‌ను ఏకచత్రాధిపత్యంతో ఏలిన టైసన్..అనామక జేక్ పాల్ ముందు తలొంచాడు. అభిమానుల్లో బాగా హైప్ క్రియేట్ చేసిన ఫైట్‌లో టైసన్‌పై జేక్ పాల్ విజయం సాధించాడు.
శనివారం ఆసక్తికరంగా సాగిన బాక్సింగ్ బౌట్లో 27ఏండ్ల పాల్ పంచ్‌లకు 58 ఏండ్ల టైసన్ దీటైన సమాధానం ఇవ్వలేదు. బౌట్‌కు ముందే ఉత్కంఠ రేపినా..అసలు పోరు మాత్రం అభిమానులను అలరించలేకపోయింది. దాదాపు 20 ఏండ్ల తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించిన టైసన్..తన ట్రేడ్‌మార్క్ పంచ్‌లు విసరడంలో విఫలమయ్యాడు. యూట్యూబర్ నుంచి బాక్సర్‌గా మారిన పాల్ తనదైన రీతిలో రింగ్‌లో చురుకుగా కదులుతూ రిఫరీలను ఆకట్టుకున్నాడు.