Asia Cup 2023 | ఆసియా కప్ ఫైనల్లో చెక్కు చెదరని నెహ్రా రికార్డు
Asia Cup 2023 : ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్ ఫైట్‌కు భారత్(Team India), డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(R Premadasa Stadium)లో రేపు ఇరుజట్ల మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా జరుగనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత బౌలర్లకు గొప్ప రికార్డు ఉంది. విశేషం ఏంటంటే...
Asia Cup 2023 : ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్ ఫైట్‌కు భారత్(Team India), డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(R Premadasa Stadium)లో రేపు ఇరుజట్ల మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా జరుగనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav), రవీంద్ర జడేజా(Ravindra Jadeja)లు మరో మూడు వికెట్లు తీస్తే చరిత్ర సృష్టిస్తారు. ప్రస్తుతం కుల్దీప్ జడ్డూ ఖాతాలో మూడేసి వికెట్లు ఉన్నాయి.
ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్లకు గొప్ప రికార్డు ఉంది. విశేషం ఏంటంటే.. మాజీ పేసర్ అశిష్ నెహ్రా (Ashish Nehra) నెలకొల్పిన రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు. నెహ్రా మూడు ఫైనల్స్‌లో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) రెండో స్థానంలో నిలిచాడు. కపిల్ రెండు ఫైనల్ మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) రెండు ఫైనల్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.
కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా

ఇప్పటివరకూ మూడు ఫైనల్స్ ఆడిన జడేజా 3 వికెట్లు తీశాడంతే. చైనామన్ బౌలర్ కుల్దీప్ 2018లో 3 వికెట్లతో చెలరేగాడు. రెండు ఫైనల్స్ ఆడిన స్టార్ పేసర్ బుమ్రా రెండు వికెట్లు మాత్రమే తీశాడు. రేపు జరుగబోయే టైటిల్ పోరులో లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే(Dunith Wellalage), కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు.
వరుణుడు అడ్డుపడేనా..!
లీగ్ మ్యాచ్‌లతో పాటు సూపర్ 4 మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడు ఫైనల్‌ను కూడా వదిలేలా లేడు. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం ఉన్నట్లు కొలంబో వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో, మ్యాచ్ వర్షార్ఫణం అవుతుందా? రిజర్డ్ డే(Reserve Day) కేటాయిస్తారా? అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే.. ఆదివారం(సెప్టెంబర్ 17న) వర్షం పడితే కనీసం 20 ఓవర్లు అయినా ఆడిసార్తు. ఒకవేళ అదీ సాధ్యం రిజర్వ్ డే(సెప్టెంబర్ 18)న యథావిధిగా మ్యాచ్ జరుగుతుంది. దురదృష్టం కొద్దీ ఆరోజు కూడా వరుణుడు అడ్డుపడితే ఇరుజట్లను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Newzealand | బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. కివీస్ కొత్త కెప్టెన్‌గా ఫెర్గూసన్
Moin Khan | పాకిస్థాన్ జట్టులో ఐక్యత లేదు.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

