బొలొగ్న (ఇటలీ ) : టెన్నిస్‌లో ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌ను ఇటలీ వరుసగా మూడో ఏడాదీ నిలబెట్టుకుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ యానిక్ సిన్నర్ గైర్హాజరీలోనూ ఇటలీ.. 2-0తో ఆరుసార్లు చాంపియన్ స్పెయిన్‌ను చిత్తుచేసి జయకేతనం ఎగురవేసింది.
బెస్ట్ ఆఫ్ త్రీ ఫార్మాట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో సింగిల్స్ విభాగపు ఆటగాళ్లు బెరెట్టిని.. 6-3, 6-4తో పాబ్లొను ఓడించగా ఫ్లావియో కొబొలి 1-6, 7-6 (6/5), 7-5తో జామ్ మునార్ను చిత్తుచేశారు. ఇటలీకి ఇది నాలుగో టైటిల్ కావడం గమనార్హం.