Euro 2024 : ప్రతిష్ఠాత్మకమైన యూరో చాంపియన్‌షిప్ 2024 పోటీలకు గట్టి పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జర్మనీ(Germany)లో జరిగే 17వ ఎడిషన్‌కు అర్హత సాధించడానికి మాజీ చాంపియన్ ఇటలీ(Italy)తో పాటు, వేల్స్, నెదర్లాండ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్వాలిఫయింగ్ కోసం వచ్చే వారం చివరి రెండు రౌండ్లు నిర్వహించనున్నారు.
ఆ రెండింటితో యూరో చాంపియన్‌షిప్ బెర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది. 2021 ఫ్రాన్స్‌ను చిత్తుచేసి రెండోసారి టైటిల్ నెగ్గిన ఇటలీ గత రెండు వరల్డ్ కప్‌లకు క్వాలిఫై కాలేకపోయింది. ఇక ఉక్రెయిన్ కూడా పట్టుదలతో ప్రయత్నిస్తోంది.
జర్మనీ వేదికగా వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 14 వరకు యూరో చాంపియన్‌షిప్ జరుగనుంది. అక్కడి హంబర్గ్‌లో జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీకి అతిథ్య జర్మనీతో పాటు స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బెల్జియం, పోర్చుగల్, టర్కీ, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా ఇప్పటికే అర్హత సాధించాయి.