Australia Womens Team | భారత పర్యటనకు ఆస్ట్రేలియా.. స్టార్ పేసర్‌కు పిలుపు
Australia Womens Team : ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత పర్యటనకు సిద్ధమవుతోంది. టీమిండియా టూర్ కోసం మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) జట్టును ప్రకటించింది. మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం 16 మందితో కూడిన బృందాన్ని...
Australia Womens Team : ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత పర్యటనకు సిద్ధమవుతోంది. టీమిండియా టూర్ కోసం మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) జట్టును ప్రకటించింది. మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. అయితే.. కెప్టెన్ ఎవరనేది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ అలిసా హేలీ, బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్ లారెన్ చీట్లేలు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) నేతృత్వంలోని భారత జట్టుతో ఆసీస్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ముంబైలో జనవరి 9 నుంచి 21 వరకు సిరీస్ జరుగనుంది. టెస్టులు, వన్డే మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంలో జరుగనుండగా.. టీ20లకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : డార్సీ బ్రౌన్, లారెన్ చీట్లే(టెస్టులకు మాత్రమే), హీథర్ గ్రాహమ్, అషే గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్(టీ 20లకు మాత్రమే), అలీసా హేలీ, జెస్ జొనాసేన్, అలనా కింగ్, ఫోబె లిట్చ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, బేత్ మూనీ, ఎలీసా పెర్రీ, మోగన్ షట్, అనాబెల్ సథర్లాండ్, జార్జియా వరేహమ్.
ఆస్ట్రేలియా మహిళా జట్టుపై చెరగని ముద్ర వేసిన మేగ్ లానింగ్(Meg Lanning)మూడు రోజుల క్రితం ఆటకు వీడ్కోలు పలికింది. దాంతో, ఆమె స్థానంలో అనుభవజ్ఞురాలైన బేత్ మూనీకి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే.. భారత పర్యటనకు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో మూనీ ఉన్నప్పటికీ ఆమెను కెప్టెన్‌గా ప్రకటించలేదు. దాంతో కొత్త నాయకురాలు ఎవరు? అనే ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
-
Chaari111 | రూటు మార్చిన వెన్నెల కిశోర్.. స్పై జోనర్ సినిమా Chaari111 లుక్ వైరల్
-
Karthika Brahmotsavam | మోహినీ అలంకారంలో దర్శనమిచ్చిన అలమేలుమంగ
-
CM KCR | గిరిజన బంధు తప్పకుండా అమలు చేస్తాం : సీఎం కేసీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

