Babar Azam: పాక్ సారథికి మద్దతుగా నిలవండిః కపిల్ దేవ్
Babar Azam: పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్న వేళ భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అతడికి మద్దతుగా నిలిచాడు.
Babar Azam: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్న వేళ భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అతడికి మద్దతుగా నిలిచాడు. బాబర్‌పై ప్రశంసలు కురిపించాడు. బాబర్ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు సారథిగా అతడు దారుణంగా విఫలమయ్యాడని పాక్ మాజీలు దుమ్మెత్తిపోస్తోన్నవేళ కపిల్ దేవ్ మాత్రం అతడికి మద్దతుగా వ్యాఖ్యానించడం గమనార్హం.
ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఇవాళ మీరు బాబర్ ఆజమ్ బాగా ఆడటం లేదని అంటున్నారు. ఎందుకంటే మీరు అతడి ప్రస్తుత ప్రదర్శనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కానీ ఇదే పాకిస్తాన్ కెప్టెన్.. ఆరు నెలల క్రితం ఆ జట్టును వరల్డ్ నెంబర్ వన్ టీమ్ గా చేశాడు. ఎవరైనా సరిగ్గా ఆడనప్పుడు 99 శాతం మంది ప్రజలు అతడిని జట్టు నుంచి తీసేయాలని అంటారు. అంతేగాక ఒక ఆర్డినరీ ప్లేయర్‌కు మద్దతుగా నిలుస్తారు. అతడిని నెక్స్ట్ సూపర్ స్టార్ అని పొగుడుతారు..’అని అన్నాడు.
World Cup-winning Greats like Kapil Dev appreciate Babar Azam and telling average cricketers how to support and respect a great batter 🙌♥️.#BabarAzam𓃵 #BehindYouBabarAzam #KapilDev #CWC23 pic.twitter.com/sSNqDBx90K
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) November 13, 2023
ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనలకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పన్లేదని సదరు ఆటగాళ్లు కఠిన పరిస్థితులలో జట్టును ఎలా గట్టెక్కిచ్చారో చూడాలని తెలిపాడు. ఒకటి, రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోరు చేసినంత మాత్రానా గొప్ప ఆటగాడి విలువ పడిపోదని కపిల్ స్పష్టం చేశాడు. బాబర్‌పై పాకిస్తాన్లో విమర్శకులు ముప్పేట దాడి చేస్తున్న తరుణంలో అతడికి కపిల్ కామెంట్స్ కాస్త ఊరటనిచ్చేవే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

