మారేడ్‌పల్లి: ప్రతిభకు వయసు అడ్డంకి కాదనేది మరోమారు నిరూపితమైంది. ఇండియన్ ఆయిల్ రేస్ అక్రాస్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో(డబ్ల్యూయూసీఏ) వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో సైక్లింగ్ రేసు జరిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 రోజుల పాటు 13 రాష్ర్టాలకు చెందిన 50 ఏండ్లకు పైబడిన సైక్లిస్టులు పోటీపడ్డారు.
మొత్తం 1615 కిలోమీటర్ల పాటు సుదీర్ఘంగా సాగిన రేసులో రాష్ర్టానికి చెందిన బొబ్బ రవీందర్‌రెడ్డి రికార్డు నెలకొల్పాడు. బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి మంగళవారం ఉదయం కన్యాకుమారిలో తన రేసును ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, జంపన ప్రతాప్, ప్రభుకుమార్‌గౌడ్ తదితరులు రవీందర్‌రెడ్డిని అభినందించారు.