Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైన్లలో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(270) రికార్డు ద్విశతకంతో రెచ్చిపోయాడు. తొలి రోజే సెంచరీతో జట్టుకు భారీ స్కోరందించిన ఇషాన్.. రెండో రోజూ విధ్వంసాన్ని కొనసాగించాడు. కుమార కుషగ్ర (101)తో రెండొందలకు పైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(72), శిఖర్ మోహన్(85)లు కూడా దంచేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ 708 పరుగలు వద్ద ఆలౌటైంది.
దులీప్ ట్రోఫీ టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోర్ కొట్టింది. తొలిరోజే సౌత్ జోన్ బౌలర్లను వణికిస్తూ ఇషాన్ కిషన్(270: 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లు) మరింత భయపెట్టాడు. తొలి రోజే సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పదోసారి మూడంకెల స్కోరందుకున్న ఇషాన్.. రెండో రోజూ రెచ్చిపోయాడు. ఓవర్‌నైట్ స్కోర్ 385/4తో ఆట మొదలెట్టిన జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026
సౌత్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేసిన ఈ చిచ్చరపిడుగు.. కుమార కుషగ్ర(101)తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించాడు. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ సాధించాడు ఇషాన్. తద్వారా టైటిల్ పోరులో ద్విశతకం బాదిన ఐదో ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు.
చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ చెలరేగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టుకు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(72), వైభవ్ సూర్యవంశీ(44)లు శుభారంభమిచ్చారు. సిరాజ్, మిలింద్ వంటి బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న వైభవ్ తొలి వికెట్‌కు వంద రన్స్ జోడించాడు. వైభవ్ అర్ధ శతకం చేజార్చుకోగా.. ఈశ్వరన్ ఫిఫ్టీతో మెరిశాడు. ఆపై శిఖర్ మోహన్(85) ధనాధన్ ఆడాడు. లంచ్ తర్వాత నుంచి ఇషాన్, కుషగ్రలు సౌత్ బౌలర్లను విసిగిస్తూ క్రీజులో పాతుకుపోగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఈస్ట్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Watch 🎥
Kumar Kushagra lights up Chennai with a brilliant 101(132) 💪
Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/zfqrn3Uh4C
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026