Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(111 నాటౌట్) శతకంతో రెచ్చిపోయాడు. భీకర ఫామ్ కొనసాగించిన ఈ చిచ్చరపిడుగు పదో సెంచరీతో జట్టుకు భారీ స్కోరందించాడు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(72), వైభవ్ సూర్యవంశీ(44), శిఖర్ మోహన్(85)లు ఇచ్చిన శుభారంభాన్ని కొనసాగిస్తూ టీ బ్రేక్ తర్వాత కుమార్ కుషగ్ర(63 నాటౌట్)తో సౌత్ బౌలర్లపై పిడుగుల్లే విరుచుకుపడ్డాడు ఇషాన్. ఐదో వికెట్‌కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. నింపాదిగా ఆడుతూ వీరిద్దరూ క్రీజునంటుకుపోవడంతో తొలిరోజే ఈస్ట్ నాలుగొందలకు చేరువైంది.
చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ బ్యాటర్లు చితక్కొడుతున్నారు. టాపార్డర్ మెరుపులతో డీలా పడిన సౌత్ జోన్ బౌలర్లను కెప్టెన్ ఇషాన్ కిషన్(111 నాటౌట్: 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మరింత భయపెట్టాడు. శ్రేయాస్ గోపాల్ ఓవర్లో బౌండరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పదో సెంచరీ సాధించాడు ఇషాన్. ధనాధన్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు కుమార కుషగ్ర(63 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. ఐదో వికెట్‌కు ఈ ద్వయం ఏకంగా 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి ఈస్ట్ 4 వికెట్ల నష్టానికి 385 పరగులు చేసింది.
💯 for Ishan Kishan 👏
He brings it up in style 💥
The East Zone captain leading from the front with a superb knock 🙌
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఈస్ట్‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(72), వైభవ్ సూర్యవంశీ(44) శుభారంభమిచ్చారు. భారత సీనియర్ పేసర్ సిరాజ్‌ను అలవోకగా ఎదుర్కొన్న వైభవ్ తొలి వికెట్‌కు వంద రన్స్ జోడించాడు. టెస్టులకు నేను సరిపోతానంటూ అర్ధ శతకానికి చేరువైన అతడిని మిలింద్ వెనక్కి పంపినా.. ఈశ్వరన్ పట్టుదలగా ఆడి ఫిఫ్టీ సాధించాడు. అయితే.. అనూహ్యంగా అతడు రనౌటయ్యాక.. శిఖర్ మోహన్(85) ధనాధన్ ఆడాడు.
4️⃣,6️⃣,4️⃣
Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥
The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
మూడు సిక్సర్లు, 9 ఫోర్లతో 85 పరుగులు చేసిన అతడు.. ఈస్ట్ జోన్ స్కోర్ బోర్డును ఉరికించాడు. సెంచరీ దిశగా సాగుతున్న మోహన్‌ను మిలింద్ బౌల్డ్ చేయగా.. సుదీప్ కుమార్ ఘరమి(6)ని త్రిపురన విజయ్ వెనక్కి పంపాడు. అనంతరం కుమార కుషగ్ర(63 నాటౌట్)జతగా కెప్టెన్ ఇషాన్ క్రీజునంటుకుపోయాడు. సౌత్ బౌలర్లకు తన స్టయిల్ విధ్వంసం చూపించిన ఇషాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 4 వేల పరగులు మైలురాయిని అధిగమించాడు. అర్ధ శతకంతో తర్వాత దూకుడు పెంచిన అతడు.. కాసేపటికే అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరందించాడు.