Ishan Kishan – Sanju Samson | వరల్డ్ కప్ జట్టులో వికెట్ కీపర్ ఎవరు..? ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ..!
Ishan Kishan - Sanju Samson : సొంతగడ్డపై జరుగనున్న వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. టోర్నీకి రెండు నెలల కంటే తక్కువ సమయం ఉండడంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. దాంతో, అతడి స్థానం కోసం....
Ishan Kishan – Sanju Samson : సొంతగడ్డపై జరుగనున్న వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. టోర్నీకి రెండు నెలల కంటే తక్కువ సమయం ఉండడంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఆసియా కప్(Asia Cup 2023)తో వరల్డ్ కప్ జట్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. దాంతో, అతడి స్థానం కోసం యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan), సంజా శాంసన్(Sanju Samson) మధ్య పోటీ నెలకొంది.
అంతేకాదు ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్న కేఎల్ రాహుల్(KL Rahul) ఫిట్నెస్ సాధిస్తే వీళ్లలో ఒకరు మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. విండీస్ సిరీస్‌లో అదరగొట్టిన ఇషాన్‌ను తీసుకుంటారా? అనుభవజ్ఞుడైన సంజూకి చోటిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
రికార్డులు చూస్తే..
ఇషాన్ కిషన్, శాంసన్ ఇద్దరూ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఆటగాళ్లు. ధనాధన్ బ్యాటింగ్‌తో పాటు అవలీలగా బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలో సిద్ధహస్తులు. ఇద్దరి వన్డే రికార్డులు తిరగేస్తే.. ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ 16వ వన్డేలు ఆడాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 46.26 సగటుతో 694 పరుగులు చేశాడు. అంతేకాదు ఏడాది కింద డిసెంబర్లో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ(213) కొట్టాడు. మరో వైపు 13 వన్డేలు ఆడిన శాంసన్ 55.71 సగుటుతో 390 రన్స్ బాదాడంతే.
సంజా శాంసన్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్

నిరుడు కారు యాక్సిడెంట్లో గాయపడడంతో భారత జట్టుకు వికెట్ కీపర్ సమస్య ఎదురైంది. టెస్టుల్లో అతడి స్థానంలో వచ్చిన శ్రీకర్ భరత్(Srikar Bharat) పర్వాలేదనిపించాడు. అయితే.. పంత్‌లా ధాటిగా ఆడలేకపోయాడు. దాంతో, వరల్డ్ కప్‌లో పరుగులు సాధించగల వికెట్ కీపర్ కోసం సెలెక్టర్లు చూస్తున్నారు. గతంలో 5వ స్థానంలో రాణించిన రాహుల్‌కు వికెట్ కీపర్‌గా అనుభవం ఉంది. దాంతో, అతడు జట్టులో ఉండడం ఖాయం అనిపిస్తోంది.
ఇషాన్ కిషన్, సంజా శాంసన్

అయితే. ఈ మధ్యే ముగిసిన విండీస్ సిరీస్(West Indies Series)లో ఇషాన్ కిషన్ దంచి కొట్టాడు. రెండు టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన అతను వన్డేల్లోనూ హ్యాట్రిక్ ఫిఫ్టీలతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన శాంసన్ రెండో వన్డేలో 9 పరుగులతో విఫలమయ్యాడు. కీలకమైన ఆఖరి వన్డేలో అర్ధ శతకంతో మెరిశాడు. ఆ తర్వాత ఐదు టీ20 సిరీస్‌లో సంజూ తీవ్రంగా నిరాశ పరిచాడు. దాంతో, ప్రపంచ కప్ జట్టుకి ఎంపికయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నాడంటూ మాజీలు అతడిని విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
T20 Rankings | అగ్రస్థానం నిలబెట్టుకున్న సూర్య.. రెండో ర్యాంక్‌లో హార్దిక్ పాండ్యా
Jasprit Bumrah | ఐర్లాండ్‌తో సిరీస్.. బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ షురూ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

