T20 Rankings | అగ్రస్థానం నిలబెట్టుకున్న సూర్య.. రెండో ర్యాంక్‌లో హార్దిక్ పాండ్యా
T20 Rankings : భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) టీ20ల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచాడు. టీ20 ఆల్రౌండర్లలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి...
T20 Rankings : భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) టీ20ల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచాడు. టీ20 ఆల్రౌండర్లలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో ర్యాంక్ సాధించాడు.
ఈరోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. వెస్టిండీస్‌పై ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన సూర్య 907 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) రెండో స్థానం దక్కించుకున్నాడు. బాబర్ ఆజాం(Babar Azam) మూడు, ఎయిడెన్ మరక్రం(Aiden Markram) నాలుగు, రీలే రస్సో(Rilee Rossouw) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
హార్దిక్ పాండ్యా

భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ(Virat Kohli) 17వ స్థానం, రోహిత్ శర్మ(Rohit Sharma) 34వ ప్లేస్‌లో ఉన్నారు. విండీస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ(Tilak Varma) 46వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క భారత క్రికెటర్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాడు.
టాప్ -5 బౌలర్లు : రషీద్ ఖాన్, జోష్ హేజిల్ వుడ్(ఆస్ట్రేలియా), వనిందు హసరంగ(శ్రీలంక), మహీశ్ థీక్షణ(శ్రీలంక), ఆదిల్ రషీద్(ఇంగ్లండ్)లు టాప్ 5 ర్యాంకు దక్కించుకున్నారు.
టాప్ – 5 ఆల్‌రౌండర్లు : షకిబుల్ హసన్(బంగ్లాదేశ్), హార్దిక్ పాండ్యా(భారత్), మహమ్మద్ నబీ(అఫ్గనిస్థాన్), షాదాబ్ ఖాన్(పాకిస్థాన్), వనిందు హసరంగ(శ్రీలంక).
ఇవి కూడా చదవండి
Jasprit Bumrah | ఐర్లాండ్‌తో సిరీస్.. బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ షురూ
Wahab Riaz | వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్‌కు షాక్.. వీడ్కోలు పలికిన సీనియర్ పేసర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

