Wahab Riaz | వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్‌కు షాక్.. వీడ్కోలు పలికిన సీనియర్ పేసర్
Wahab Riaz : ఆసియా కప్(Asia Cup), వన్డే ప్రపంచ కప్(ODI WC 2023) ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్.. సీనియర్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్(Wahab Riaz) ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు వీడ్కోలు పలికాడు. రెండేళ్లుగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన అతను..
Wahab Riaz : ఆసియా కప్(Asia Cup), వన్డే ప్రపంచ కప్(ODI WC 2023) ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్.. సీనియర్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్(Wahab Riaz) ఈరోజు అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు వీడ్కోలు పలికాడు. రెండేళ్లుగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
‘అంతర్జాతీయ వేదికలపై పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈరోజుతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా. రిటైర్మెంట్ తీసుకోవడంపై రెండేళ్లుగా ఆలోచిస్తున్నా. ఈ ఏడాది కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా. అయితే.. ఇకనుంచి ఫ్రాంచైజ్ క్రికెట్(franchise cricket)లో మాత్రమే కనిపిస్తాను. పలు దేశాల లీగ్స్‌లో అభిమానులను మళ్లీ అలరిస్తాను. ఆయా లీగ్స్‌లో ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లతో పోటీపడడాన్ని ఆస్వాదిస్తాను’ అని రియాజ్ వెల్లడించాడు. ఈ ఎడమ చేతివాటం పేసర్ తన కెరీర్లో మూడు వరల్డ్ కప్(2011, 2015, 2019)లు ఆడాడు.
2011 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియాపై 5 వికెట్లు తీసిన రియాజ్

రియాజ్ 2008లో పాక్ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2011 వరల్డ్ కప్‌లో రియాజ్ గొప్పగా రాణించాడు. సెమీఫైనల్లో టీమిండియాపై 5 వికెట్ల ప్రదర్శనతో ఔరా అనిపించాడు. దాంతో, టెస్టు జట్టులోకి వచ్చాడు. కానీ, పూర్తిగా వన్డేలు, టీ20ల మీదనే ఫోకస్ పెట్టాలని 2019లో టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్నాడు. 2020 డిసెంబర్లో రియాజ్ పాక్ తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20 ఆడిన రియాజ్ 237 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి
Ben Stokes | ఇంగ్లండ్ వరల్డ్ కప్ హీరో వచ్చేశాడు.. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో జట్టులోకి
Rishabh Pant | మళ్లీ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

