Ben Stokes | ఇంగ్లండ్ వరల్డ్ కప్ హీరో వచ్చేశాడు.. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో జట్టులోకి
Ben Stokes : వరల్డ్ కప్(ODI WorldCcup 2023) ముందు ఇంగ్లండ్ జట్టుకు తీపి కబురు. 2019 ప్రపంచ కప్ (world cup 2019) హీరో బెన్ స్టోక్స్(Ben Stokes) మళ్లీ 50 ఓవర్ల ఆటలోకి వస్తున్నాడు. ఈ స్టార్ ఆటగాడు వన్డే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో సెలెక్టర్లు స్టోక్స్‌ను న్యూజిలాండ్(newzealand)తో వన్డే సిరీస్‌కు...
Ben Stokes : వరల్డ్ కప్(ODI WorldCcup 2023) ముందు ఇంగ్లండ్ జట్టుకు తీపి కబురు. 2019 ప్రపంచ కప్ (world cup 2019) హీరో బెన్ స్టోక్స్(Ben Stokes) మళ్లీ 50 ఓవర్ల ఆటలోకి వస్తున్నాడు. ఈ స్టార్ ఆటగాడు వన్డే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో సెలెక్టర్లు స్టోక్స్‌ను న్యూజిలాండ్(newzealand)తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. అతడి రాకతో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. మెగా టోర్నీలో స్టోక్స్ ఆడాలని కోరుకుంటున్నామని హెడ్‌కోచ్ మాథ్యూ మాట్(Matthew Mott) రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఏడాది కింద జో రూట్ (Joe Root) నుంచిటెస్టు కెప్టెన్‌గా స్టోక్స్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటినుంచి పూర్తిగా సుదీర్ఘ ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టాలని వన్డేల నుంచి తప్పుకున్నాడు. అతడి సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు సొంతగడ్డపై ఈమధ్యే యాషెస్ సిరీస్(Ashes Series)ను 2-2తో సమం చేసింది.
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : జోస్ బట్లర్(కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లియాం లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీసీ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌కు ప్రపంచ కప్ అనేది అందని ద్రాక్ష. చేతికందకుండా ఊరిస్తున్న ఆ ట్రోఫీని 2019లో మోర్గాన్ సేన దక్కించుకుంది. ఆ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు.
వరల్డ్ కప్ ట్రోఫీతో బెన్ స్టోక్స్

సూపర్ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించింది. తొలిసారి వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈసారి భారత గడ్డపై ఆక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజలాండ్ను ఢీ కొట్టనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

