Ireland : ఐర్లాండ్ పురుషుల జట్టు త్వరలోనే రెండు ఫార్మాట్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లనుంది. దాంతో మంగళవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. టెస్టు, టీ20 సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేశారు. టెస్టులకు ఆండ్రూ బల్బిరీ (Andrew Balbirnie) కెప్టెన్‌గా, టీ20లకు పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) సారథిగా వ్యవహరించనున్నారు. రెండేళ్ల క్రితం బంగ్లాకు వెళ్లిన స్క్వాడ్‌లోని ఏడుగురికి మాత్రమే ఈసారి చోటుదక్కింది. అయితే.. సుదీర్ఘ ఫార్మట్‌లో ఏకంగా ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లను తీసుకున్నారు.
దేశవాళీలో రాణిస్తున్న యువకెరటాలను సెలెక్టర్లు బంగ్లా పర్యటనకు ఎంపిక చేశారు. కడే కర్మికేల్, లియాం మెక్‌కార్తీ, జొర్డన్ నీల్, స్టీఫెన్ డొహెనీ సహ గవిన్ హొయోలు టెస్టుల్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. నవంబర్ 11 నుంచి తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 19న ఢాకాలో మొదలవ్వనుంది. అనంతరం ఆతిథ్య బంగ్గాతో ఐర్లాండ్ పొట్టి సిరీస్ ఆడనుంది.
Ireland have named five potential debutants in their Test squad to tour Bangladesh next month, while Mark Adair and Josh Little are fit to return for the T20Is after missing the series against England ☘️ pic.twitter.com/7qXOFZKLtv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025
ఐర్లాండ్ టెస్టు స్క్వాడ్ : ఆండ్రూ బల్బిరినీ(కెప్టెన్), కర్టిస్ కాంఫర్, కడె కర్మికేల్, స్టీఫెన్ డొహెని, గవిన్ హొయో, గ్రాహం హమె, మాథ్యూ హంప్రెస్, ఆండీ మెక్బ్రినె, బ్యారీ మెక్‌కార్టీ, లియాం మెక్‌కార్టీ, పాల్ స్టిర్లింగ్, జోర్డాన్ నీల్, హ్యారీ టెక్టర్, లొర్కాన్ టక్నర్, క్రెగ్ యంగ్.
ఐర్లాండ్ టీ20 స్క్వాడ్ : పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గరెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంపెర్స్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, బెన్ వైట్, లొర్కాన్ టక్నర్, క్రెగ్ యంగ్.