IPL | 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్
2023 ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్ల కోసం రూ.20.55 కోట్లు ఖర్చు చేయనున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ త్వరలోనే మొదలుకానుంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో ఇప్పటికే చాలా జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకున్నాయి. మరికొన్ని జట్లు ఒప్పందం ద్వారా కొందరిని ఇతర జట్లకు అమ్మేశాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వదులుకుంది. తమ ట్విట్టర్లో ఖాతాలో వదులుకున్న ఆటగాళ్ల ఫొటోల్నిపెట్టింది. ఐపీఎల్ సీజన్లో ముంబై జట్టు ఇంతమందిని తొలగించడం ఇదే మొదటిసారి. వేలంలో ఈ ఫ్రాంఛైజీ 13మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. వీళ్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ.20.55 కోట్ల ఖర్చు చేయనుంది.
ముంబై జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో.. కీరన్ పోలార్డ్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, సంజయ్ యాదవ్, రిలే మెరిడిత్, టైమల్ మిల్స్, డానియెల్ సామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.
పోయిన ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో, యాజమాన్యం జట్టు కూర్పు మీద దృష్టిపెట్టింది. అందులో భాగంగానే పలువురు ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై వచ్చే సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.
Once a part of #OneFamily, always a part of #OneFamily 💙#MumbaiIndians pic.twitter.com/4eTXunUyof
— Mumbai Indians (@mipaltan) November 15, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

