న్యూఢిల్లీ: ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం పూర్తిగా సిద్ధమైంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ముగిడయమే ఆలస్యం ఐపీఎల్ రానే వస్తున్నది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి22న జరిగే అవకాశముంది. దీనికి తోడు మే 25న కోల్‌కతాలోనే ఫైనల్ పోరు జరుగనుంది.
గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న తమ తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొననుంది. అదే రోజు రాత్రి మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరుగునుంది. ఈసీజన్లో 10 జట్లు 12వేదికల్లో తలపడనున్నాయి. నిరుడు లాగే ఈసారి పంజాబ్, రాజస్థాన్..ధర్మశాల, గువాహటిలో మ్యాచ్‌లు ఆడనునున్నాయి. ఆర్సీబీ..రజత్ పటీదార్ నేతృత్వంలో బరిలోకి దిగనుండగా, పంజాబ్‌కింగ్స్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు.