మాస్టర్ మైండ్‌పై.. యువ నాయకుడిదే పైచేయి అయింది. పొట్టి క్రికెట్లో అపార అనుభవం ఉన్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ జట్టుపై.. యంగ్ తరంగ్ రిషబ్ పంత్ టీమ్ విజయం సాధించింది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. ఈ గెలుపుతో లీగ్‌లో 20 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్కు దూసుకెళ్లింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో తొలుత చెన్నైని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ.. ఆనక బ్యాటింగ్‌లో తలా కొన్ని పరుగులు చేయడంతో సునాయాస విజయం సొంతం చేసుకుంది.
దుబాయ్: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఢిల్లీ పైచేయి సాధించింది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తెలుగు ఆటగాడు రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చెన్నై తరఫున తొలిసారి బరిలోకి దిగిన రాబిన్ ఉతప్ప (19) ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ (1/20), కగిసో రబడ (1/21) పొదుపుగా బౌలింగ్ చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. హెట్‌మైర్ (18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) కీలక పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో జడేజా, శార్దూల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్‌పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
చెన్నై: గైక్వాడ్ (సి) అశ్విన్ (బి) నోర్జే 13, డుప్లెసిస్ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 10, ఉతప్ప (సి అండ్ బి) అశ్విన్ 19, అలీ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 5, రాయుడు (నాటౌట్) 55, ధోనీ (సి) పంత్ (బి) అవేశ్ 18, జడేజా (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 136/5. వికెట్ల పతనం: 1-28, 2-39, 3-59, 4-62, 5-132, బౌలింగ్: నోర్జే 4-0-37-1, అవేశ్ 4-0-35-1, అక్షర్ 4-0-18-2, రబడ 4-0-21-0, అశ్విన్ 4-0-20-1.
ఢిల్లీ: పృథ్వీ (సి) డుప్లెసిస్ (బి) దీపక్ 18, ధవన్ (సి) అలీ (బి) శార్దూల్ 39, శ్రేయస్ (సి) గైక్వాడ్ (బి) హజిల్‌వుడ్ 2, పంత్ (సి) అలీ (బి) జడేజా 15, రీపల్ (సీ) దీపక్ (బి) జడేజా 18, అశ్విన్ (బి) శార్దూల్ 2, హెట్‌మైర్ (నాటౌట్) 28, అక్షర్ (సి) అలీ (బి) బ్రావో 5, రబడ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 19.4 ఓవర్లలో 139/7. వికెట్ల పతనం: 1-24, 2-51, 3-71, 4-93, 5-98, 6-99, 7-135, బౌలింగ్: దీపక్ 3-0-34-1, హజిల్‌వుడ్ 4-0-27-1, జడేజా 4-0-28-2, ఆలీ 3-0-16-0, శార్దూల్ 4-0-13-2, బ్రావో 1.4-0-20-1.