IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లకు చెల్లించే వేతనాలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. విదేశీ క్రికెటర్లకు వేలంలో కోటానుకోట్లు కుమ్మరిస్తున్న వేళ కుంబ్లే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్‌కు రూ . 24.75 కోట్లు, పాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వేలం జరిగే క్రమంలో కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓవర్సీస్ ప్లేయర్లకు కోటానుకోట్లు కుమ్మరించే ఫ్రాంచైజీలు స్థానికంగా ఉండే క్రికెటర్లపై కోటి రూపాయలు కూడా వెచ్చించడం లేదని, ఇది తీవ్ర అసమానతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
వేలం జరుగుతున్న క్రమంలో కుంబ్లే జియో సినిమాలో స్పందిస్తూ… ‘ఒక జట్టులో 25 మంది సభ్యులుంటే అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉంటున్నారు. వేలంలో ఫ్రాంచైజీలు ఓవర్సీస్ ప్లేయర్ల కోసం ప్రత్యేకమైన పర్స్‌ను కేటాయించాలి. లేకుంటే వేలంలో తీవ్ర అసమానతలు ఉంటాయి…
Mantra of IPL 2024 auction:
Be an Australian, Be a fast bowler. pic.twitter.com/mojK1znQM7
— Johns. (@CricCrazyJohns) December 19, 2023
నేను చెప్పే మాటలు ఓవర్సీస్ క్రికెట్ ఫ్యాన్స్ నచ్చకపోవచ్చు. కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. ఓవర్సీస్ ప్లేయర్లకు తప్పకుండా ప్రత్యేకంగా పర్స్ ఉండాలి. అలా లేని పక్షంలో ఒక జట్టులో సుమారు 60 శాతం మందికి ఇచ్చే నగదు.. అదే జట్టులోని నలుగురైదుగురు ఆటగాళ్లకు మాత్రమే వెళ్తుంది. తుది జట్టులో 8 మంది ఆటగాళ్లు భాగమైతే అది వాళ్లకు చాలా హెల్ప్ అవుతుంది. భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లకు సాధారణ ధర పొందే ఆటగాళ్ల మధ్య గ్యాప్‌ను పూడించడం అవశ్యకం..’ అని కుంబ్లే తెలిపాడు.